అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే: అలీ బాబర్‌ పాత్రా!!

కశ్మీర్‌లో చొరబాటుకు యత్నించి, భారత సైన్యానికి చిక్కిన ఉగ్రవాది అలీ బాబర్‌ పాత్రా (19) సంచలన విషయాలు ఎట్టకేలకు బయటపెడుతూ తాను పాకిస్థాన్‌కు చెందినవాడినని, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తనకు శిక్షణ ఇచ్చినట్టు అంగీకరించాడు.

ఈనెల 26న ఉరి సెక్టార్‌ వద్ద ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో భారత సైనికులు అతడిని బంధించిన నేపథ్యంలో తన కుటుంబ నేపథ్యం, ఉగ్రవాద శిక్షణ పొందడానికి దారితీసిన పరిస్థితులపై మీడియాతో మాట్లాడాడు. అతని వివరాలు అతని మాటల్లో… ‘‘నాది పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రాంతానికి చెందిన ఒకారా. మాది పేద కుటుంబం. నాన్న లేడు. వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాడిని. ఆ సమయంలో ఐఎస్‌ఐతో సంబంధాలున్న కుర్రాడితో పరిచయం ఏర్పడింది. డబ్బుకి ఆశపడి అతనితో పాటు లష్కరే తొయిబాలో చేరాను. శిక్షణ సమయంలో వారు రూ.20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయ్యాక మరో రూ.30 వేలు ఇస్తామన్నారు. తర్వాత నన్ను పాకిస్థాన్‌ సైన్యం వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పినట్టు నేను, మరికొందరు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించాం. మాలో ఒకరిని భారత సైనికులు హతమార్చారు. నలుగురు పారిపోయారు. సైనికులు నన్ను పట్టుకున్నారు. పాక్‌ సైనికులతో పోల్చితే భారత సైనికుల వ్యవహారశైలి భిన్నంగా ఉంది. ఇక్కడి పరిస్థితులు చూశాక… కశ్మీర్‌ విషయంలో పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ, లష్కరే తొయిబా చెప్పేవన్నీ అబద్ధాలేనని అర్థమైంది. వారికి నా మొర ఒక్కటే. నన్ను భారత్‌కు ఎలా పంపారో, తిరిగి మా అమ్మ దగ్గరకు అలాగే తీసుకెళ్లండి. భారత సైన్యం రక్తపాతం సృష్టిస్తుందని మాకు చెప్పారు. కానీ ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. సైనికులు నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఈ విషయం మా అమ్మకు చెప్పాలని ఉంది’’ అని అలీ పేర్కొన్నాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •