క్రైమ్ (Crime) వార్తలు (News)

దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ పైనుండి దూకిన వ్యక్తి మృతి!!

హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చత్తీస్‌గఢ్‌ లోని దంతెవాడ పరిధి కువకొండకు చెందిన భీమా (45) దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి పలు మెట్రో స్టేషన్ల వద్ద తిరుగుతున్నాడు.

గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకున్న అతను అక్కడి మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజీవ్‌ చౌక్‌ వద్ద పికెట్‌ విధుల్లో ఉన్న పోలీసులు 108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •