టెక్నాలజీతో పాటు రకరకాల మార్పులు చోటు చేసుకుంటూ ఎప్పుడూ లేనన్ని కొత్త రకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ ప్రపంచం మరింత స్మార్ట్ గా తయారవుతుండటంతో పనులు కూడా అంతే స్మార్ట్ గా మారుతున్నాయి. ఇక ఇప్పుడు రోబోల విషయంలో కూడా ఇలాగే టెక్నాలజీ మరింత వేగంగా పుంజుకుంటోంది. మామూలుగానే రోబోలు అంటే అందరికీ ఎక్కడా లేనంత ఇంట్రెస్ట్ పుడుతుంది. అయితే ఇప్పుడు ఓ రోబో గురించిన వార్త హల్ చల్ చేస్తోంది.

దాని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే సాధారణంగా రోబోలు అంటే బయట మనకు తెలిసినంత వరకు ఏదో ఇనుములాగా ఉంటాయి కానీ మనిషి రూపాన్ని పోలి ఉండదు. అయితే ఇప్పుడు ఓ కంపెనీ ఇలాంటి ప్రయోగమే చేయబోతోంది. అది కూడా ఎవరైనా తమ ముఖాన్ని పోలినట్టు ఉండే రోబోని తయారు చేయాలని కోరుకుంటే కొన్ని అర్హతలు ఉంటే వారిలాగే రోబోను తయారు చేసేందుకు ప్రోమోబాట్ అనే రోబోల కంపెనీ ముందుకు వచ్చింది.

మనుషుల్లాగే ఉండే రోబోలను తయారు చేసేందుకు ఎవరైనా తమ ముఖానికి ఉండే ఫేస్ రైట్స్‌ను ఇస్తే వారికి రూ.1.5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. ప్రపచంలో ఎవరైనా ఇవ్వొచ్చని, ఇందుకు ఎలాంటి లింగ, మత బేధాలు లేవని తెలిపింది. కాగా 25 ఏళ్లు పైబడి ఉన్న ఎవరైనా అర్హులే అంటూ ప్రకటించింది. యుఎస్ఎ కు చెందిన ఈ కంపెనీ ఫేషియల్ రికగ్నిషన్, అలాగే స్పీచ్, అటానమస్ నావిగేషన్, హ్యూమనాయిడ్ రోబోస్ తయారీలో ఈ కంపెనీ ముందు వరుసలో ఉంది. ఇలా ఎవరైనా ముందుకు వస్తే వారి ముఖాన్ఇన 3డీ స్కాన్ చేసి, జీవితాంతం ఫేస్ రైట్స్‌ను కంపెనీ ఉపయోగించుకుంటుందట.