రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్)కు చెందిన వివిధ ట్రేడుల్లో మొత్తం 1664 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (డిసెంబర్ 1) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్‌ ట్రేడుల్లో ఉన్న 1664 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 01.12.2021 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 02-11-2021 రోజున ప్రారంభం కాగా 01-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.