దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 8,954 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనాతో 267 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,69,247 కు చేరింది. గత 24 గంటల్లో 10,207 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు సంఖ్య 99,023 కి చేరింది.