దేశంలో నంబర్ వన్‌ ధనవంతుడుగా పేరు తెచ్చుకున్న ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్ కంపెనీ దివాలా తీసింది. రిలయన్స్‌ క్యాపిటల్ కంపెనీ బోర్డును రద్దు చేస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంక్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు చేసిన అప్పులు చెల్లించడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్‌బీఐ ఈ చర్య చేపట్టింది.

ప్రాథమిక విచారణలో కంపెనీ నిర్వహణకు సంబంధించి కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు, అలాగే దివాలా ప్రక్రియ త్వరలోనే ప్రారంభమౌతుందని ఆర్‌బీఐ వెల్లడించింది.