దేశంలో గత కొంతకాలంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని నిత్యావసర ధరలు కూడా పెరుగుతూ సామాన్యులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కూడా కొంతకాలం ఆపేయడంతో సామాన్యులకు ఇది కూడా భారం అయింది.

ఇప్పుడు తాజాగా ఈ సబ్సిడీ విషయం గురించి ప్రభుత్వం ఆందోళన పడవద్దు అని తెలియజేస్తూ సబ్సిడీ ని తిరిగి పునరుద్ధరించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. వీటికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ ఇస్తుండగా ఇకపై ఈ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలలో కూడా సబ్సిడీని విడుదల చేసే అవకాశం ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఆయిల్ కంపెనీ సంస్థలకు 303 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ మనకు 587 రూపాయలకే ఇవ్వనున్నట్లు గా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న వంటగ్యాస్ ధర 900 రూపాయలు ఇలాంటి సమయంలో గ్యాస్ సబ్సిడీని పొందాలంటే ఆధార్ కు లింక్ చేయాలని, అందుకు సంబంధించిన డీలర్ వద్దకు వెళ్లి మీ ఖాతాను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. ఇక LPG గ్యాస్ వినియోగదారుల సబ్సిడీ టోల్ ఫ్రీ నెంబర్..1800-233-3555 ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కానీ 2020 లో సంవత్సరంలో 147.67 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అందించింది. కానీ అప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 731 ఉన్నది. కానీ ఆ తరువాత ఏకంగా 205 రూపాయలు పెరిగింది. దీంతో ఇప్పుడు 900 రూపాయలకి దొరుకుతుంది.