బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ మొదలయింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ 1098 హెల్ప్‌లైన్‌కు డయల్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో ప్రధాని ప్రకటించారని ‘మీ ఇంట్లో మీకు ఏదైనా ఫంక్షన్/ పార్టీ ఉంటే. మీరు చాలా ఆహారం వృధా అయ్యే అవకాశం ఉన్నట్లయితే, దయచేసి 1098కి కాల్ చేయడానికి వెనుకాడకండి. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది వచ్చి ఆహారాన్ని సేకరిస్తారు. దయచేసి చాలా మంది పిల్లలకు ఆహారం అందించడంలో సహాయపడే ఈ సందేశాన్ని ప్రసారం చేయండి’ అంటూ ప్రాచుర్యంలో ఉంది. ఈ విషయాన్ని పలువురు ప్రస్తావించడంతో హెల్ప్‌లైన్‌కు డయల్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.