దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 623 పాయింట్ల లాభంతో 57,688 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 17,178 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. పవర్‌గ్రిడ్‌ ఒక్కటి నష్టాల్లో పయనిస్తుంది.