దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్ సూచీలు రోజంతా అదే ఒరవడి కొనసాగించాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,365.85 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 57,846.45 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 619.92 పాయింట్ల లాభంతో 57,684.79 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,104.40 పాయింట్ల వద్ద ప్రారంభమైన ఇంట్రాడేలో 17,213.05 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 183.70 పాయింట్లు లాభపడి 17,166.90 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, మారుతీ, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి. టైటన్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.