సంక్రాతి అందరూ కలిసి వారి సొంతగ్రామాలకు చేరుకొని జరుపుకునే పండగ. మరి ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కూడా చాల ఎక్కువగా ఉంటుంది. దీంతో సంక్రాంతి పండుగకు లింగంపల్లి-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

జనవరి 3 నుంచి 18 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని, కాకినాడ నుంచి లింగంపల్లికి ఏడు, లింగంపల్లి నుంచి కాకినాడకు ఏడు ట్రిప్పులు నడుస్తాయని జోన్‌ సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని బరంపురం స్టేషన్‌కు 9న, తిరిగి బరంపురం నుంచి సికింద్రాబాద్‌కు 10న రెండు ప్రత్యేక ట్రిప్పులు నడిపించనున్నట్లు కూడా ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.