నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఊపందుకుని గతంలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ నెలలో రికార్డు సృష్టించాయి. డిసెంబర్ ఒక్కనెలలోనే రూ.3,459 కోట్ల మద్యం తాగారు. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.171.93 కోట్ల లిక్కర్‌ సేల్‌ చేశారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ 2021 డిసెంబర్‌లో సుమారు 700 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లో 40.48 లక్షల కేసుల లిక్కర్, 34 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్టు ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది.