దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10,82,376 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 27,553 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 284 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 4,81,770కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 9,249 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి మొత్తం సంఖ్య 3.42 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 1,22,801గా ఉన్నాయి. ఇక శనివారం ఉదయానికి 14 వందలుగా ఉన్న కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి 1525కి చేరింది.