కరోనా సోకినవారికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే యాంటీవైరల్ డ్రగ్ హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ‘మోల్నుపిరావిర్‌’. ఈ మెడిసిన్ కరోనాను ఐదు రోజుల్లో కట్టడి చేయగలుగుతుందని చెబుతున్న ఈ మోల్నపిరావిర్ భారత్ లో ముందుగా హైదరాబాద్‌ లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇవి 40 ట్యాబ్లెట్స్ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.2,500లకు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ కు చెందిన అప్టిమస్ ఫార్మా భారత్ లో కోవిడ్-19 చికిత్స కోసం మోల్నుపిరావిర్ ను విడుదల చేసింది.80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ కలిగిన వయోజన రోగుల కోసం మోల్నుపిరావిర్‌ను ఆమోదించింది. ఈ మెడిసిన్ కు షరతులతో కూడిన ఆమోదం లభించింది. ఇటీవల ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌కు రోగి మరణ ప్రమాదం ఉన్నట్లయితేనే ఈ మోల్నుపిరావిర్ ఇవ్వాలని క్లినికల్ డేటా యొక్క సమీక్ష తర్వాత Drugs Controller General of India (DCGI’ ఆమోదించింది. ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే కావడం గమనించదగ్గ విషయం.

మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందించేందుకు అనుమతి పొందిన 13 కంపెనీల్లో ఒకటైన ఆప్టిమస్‌ సంస్థ మోల్‌కోవిర్‌ పేరుతో ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని గురువారం (డిసెంబర్ 30,2021) హైదరాబాద్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా మెల్నుపిరావిర్‌ని రేపోమాపో మార్కెట్‌లోకి తేవాలని ఆయా కంపెనీలు కూడా యుద్ధప్రతిపాదికన యత్నిస్తున్నాయి.