ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారి వరుసగా జాబ్ మేళాలను నిర్వహిస్తూ స్థానిక యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.

GRANULES India Limited సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 3న ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సంస్థలో మొత్తం 30 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంటర్ (M.P.C/Bi.P.C) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు SDT Team Member గా పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎంపికైన వారికి ఏడాదికి రూ. 1.35 లక్షల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18-21 ఏళ్లు ఉండాలి. ఇంకా కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

-అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు రెజ్యుమ్, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ ను వెంట తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9014772885 నంబర్ ను సంప్రదించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు J.N Pharma City, Parawada లో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఉన్నత విద్య అందించబడుతుంది. రెండేళ్ల పాటు రాయితీపై హాస్టల్, భోజన వసతి కల్పించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ జరుగు స్థలం: ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, పెందుర్తి, విశాఖపట్నం జిల్లా, ఏపీ.