దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు సందడి చేయనున్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా వివిధ కంపెనీలు మార్కెట్ ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. కొత్త కొత్త ఫీచర్లు తో, సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. సెల్ ఫోన్ మార్కెట్ లో ప్రపంచం లోనే రెండో స్తానం లో ఉన్న భారత్ లో డిమాండ్ కు కొదవే ఉండదు.

తాగాజా స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ వన్‌ప్లస్‌ ‘వన్‌ ప్లస్‌ 10ప్రో’ పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవ్వగా….ఆఫోన్‌కు సంబంధించి ఫీచర్లు లీకయ‍్యాయి. ఇది మార్కెట్ స్ట్రాటజీ లో భాగం అని కొందరి విశ్లేషణ. కాస్త ఆలస్యం గా మార్కెట్ లోకి విడుదల కావాల్సిన ఈ మోడల్ ఫీచర్లు లీక్ అవ్వడం తో, ఇంక వేరే దరి లేక మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు అని మరి కొందరి వాదన. ఏది ఏమైనా, కొత్త ఏడాది సందడి షురూ చేసిన బడా కంపనీలు.

వన్‌ప్లస్‌, అఫీషియల్‌గా ఈ కొత్త మోడల్ చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తరువాత గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల కానున్న మోడల్ ఇది.

‘వన్‌ ప్లస్‌ 10ప్రో’ స్పెసిఫికేషన్‌లు :
చైనాలో విడుదలైన వన్‌ ప్లస్‌ 10ప్రో వీడియో ప్రకారంగా స్నాప్‌ డ్రాగన్‌ 8జనరేషన్‌ 1చిప్‌సెట్‌, 50ఎంపీ మెయిర్‌ రేర్‌ కెమెరా, 6.7 కర్వుడ్‌ ఎల్‌టీపీఓ 2.0 అమోలెడ్‌ డిస్‌ప్లే, 120హెచ్‌ జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, బ్యాటరీ కెపాసిటీ 5,000ఎంఏహెచ్‌, ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌ అందుబాటులో రానున్నాయి.