ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం అయిపొయింది. ఒకరు సంపాదిస్తుంటే వచ్చే ఆదాయం సరిపోకపోవడం అనే కారణం కావచ్చు, మరొక కారణం కావచ్చు మహిళలు పని చేస్తున్నారు. కానీ బయటకు వెళ్లి పని చేయడం అనేది అందరికి సాధ్యమయ్యే పని కాదు దీంతో ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఇంట్లో ఉంది చేసే కొన్ని పనులు ఉన్నాయి. అవేంటంటే..

మొలకలు : ఎక్కువమంది పోషకాహారం మీద శ్రద్ధ పెడుతూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ పోషకాహారం తయారు చేసుకుని తినే సమయం లేని వారికి మొలకెత్తిన విత్తనాలు విక్రయించడం ద్వారా మీరు మంచిగా సంపాదించుకోవచ్చు. పైగా దీనికోసం రోజంతా శ్రమించక్కర్లేదు. రోజుకి రెండు మూడు గంటలు కష్టపడితే సరిపోతుంది. మిల్క్ వెండర్స్, పేపర్ బాయ్స్ లాంటి వారితో ఒప్పందం కుదుర్చుకుని ఉదయంవేళ ఈ మొలకలని ప్రతిరోజూ అందిస్తే స్థిరమైన ఆదాయం వస్తుంది.

నర్సరీ గార్డెన్: ఇది నిజంగా ఇంట్లో ఉండే గృహిణుల కి మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. 100 గజాల స్థలం ఉంటే చక్కగా ఈ బిజినెస్ ని మీరు మొదలు పెట్టొచ్చు ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ముద్ర పథకం ద్వారా రుణాలు పొంది కొత్త తరహా మొక్కల్ని అందుబాటులో ఉంచడం ద్వారా నర్సరీ అద్భుతంగా రన్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

రోటి తయారు చేయడం: రాత్రిపూట అన్నానికి బదులుగా చాలామంది చపాతీ, జొన్న రొట్టెలని తింటారు అయితే మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టి బాగా సంపాదించవచ్చు లైవ్ గా చపాతీలు కాల్చి మీరు ఇస్తే వ్యాపారం బాగా రన్ అవుతోంది. ఆలా కుదరకపోతే మీరు ఇంట్లో తయారు చేసి సప్లై చేయొచ్చు ఇలా గృహిణులు కూడా ఆదాయం పొందవచ్చు.