టాప్ స్టోరీస్ (Top Stories) రాజకీయం (Politics)

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్‌

తెలుగుదేశం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్ల‌వారుజామున అచ్చెన్నాయుడు స్వ‌గ్రామ‌మైన శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ గ్రామంలో పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న‌ను కోట‌బొమ్మాళి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. నిమ్మాడ‌లో వైసీపీ బ‌ల‌ప‌ర్చిన స‌ర్పంచ్ అభ్య‌ర్థిని నామినేష‌న్ వేయ‌కుండా బెదిరించాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. నిన్న ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

అచ్చెన్న స్వ‌గ్రామం నిమ్మాడ‌లో గ‌త కొన్నేళ్లుగా పంచాయితీ ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు కుటుంబ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఏక‌గ్రీవంగా అచ్చెన్న బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థులే స‌ర్పంచ్ అవుతున్నారు. అచ్చెన్న వ‌ర్గానికి వ్య‌తిరేకంగా ఎవ‌రూ నామినేష‌న్ వేయ‌డం లేదు. ఈసారి మాత్రం అచ్చెన్న ద‌గ్గ‌రి బంధువు, వ‌రుస‌కు కుమారుడు అయ్యే అప్ప‌న్న అనే వ్య‌క్తి వైసీపీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేయాల‌నుకున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న అచ్చెన్న వెంట‌నే అప్ప‌న్న‌కు ఫోన్ చేసే నామినేష‌న్ వేయొద్ద‌ని నచ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అప్ప‌న్న నామినేష‌న్ వేయ‌డానికే నిర్ణ‌యించుకున్నాడు. అప్ప‌న్న‌కు మ‌ద్ద‌తుగా టెక్క‌లి వైసీపీ ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ కూడా నిమ్మాడ వ‌చ్చారు. వీరిని అచ్చెన్న వ‌ర్గీయులు అడ్డుకున్నారు. చివ‌ర‌కు పోలీసుల స‌హ‌కారంతో అప్ప‌న్న నామినేష‌న్ వేశారు. అభ్య‌ర్థిని నామినేష‌న్ వేయ‌కుండా బెదిరించ‌డం, అడ్డుకోవ‌డంపై అచ్చెన్నాయుడుపై కేసు న‌మోదు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.