రాజకీయం (Politics)

బ్రేకింగ్‌: టీడీపీ నేత ప‌ట్టాభిపై దాడి… గాయాలు

తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై దాడి జ‌రిగింది. ఇవాళ ఆయ‌న విజ‌య‌వాడ‌లో త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌పై దాడికి పాల్ప‌డ్డారు. దాడిలో ప‌ట్టాభికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఆయ‌న కారు అద్దాలు కూడా ధ్వంస‌మ‌య్యాయి. సెల్‌ఫోన్ ప‌గిలిపోయింది. ఆయ‌న‌కు ఆసుప‌త్రిలో ప్రాథ‌మిక చికిత్స అందించారు.

అయితే, త‌న‌పై దాడి చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని ప‌ట్టాభి ఆరోపిస్తున్నారు. 15 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌లు, రాడ్లు, బండ రాళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డార‌ని వాపోయారు. వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతిని ప్ర‌శ్నిస్తున్నందుకే త‌న‌పై దాడి చేయించార‌ని, గ‌త 10 రోజులుగా త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌న్నారు.

త‌న‌పై జ‌రిగిన దాడి వెనుక మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ హ‌స్తం ఉంద‌ని ప‌ట్టాభి ఆరోపించారు. ప‌క్కా వ్యూహంతో త‌న‌ను హ‌త్య చేసేందుకే ఈ దాడి చేశార‌న్నారు. ఎన్ని దాడులు చేసినా వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌న్నారు. దాడులు జ‌రుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కాగా, ప‌ట్టాభిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ప‌రామ‌ర్శించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.