కన్నడ సినిమా షూటింగ్ చేస్తుండగా కొన్నియాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో అనుకోకుండా హీరో రిషబ్ శెట్టి గాయపడ్డారు. షూటింగ్ లో పెట్రోల్ బాంబులు వేసే సన్నివేశం తీస్తుండగా బాంబులు ముందుగానే పేలడంతో హీరో రిషబ్ శెట్టి తో పాటు మరొకరు కూడా గాయపడ్డారు. సినిమాలో భాగంగా ఫైట్ సీన్స్ తీస్తున్నారు. అందులో భాగంగా హీరో రిషబ్‌తో పాటుమరొక నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు విసిరి పారిపోవాల్సిన సన్నివేశాలు షూట్ చేయాలి. కానీ ఈ సీన్‌లొ వారు పరుగెట్టేలోపుగా పెట్రో బాంబులు పేలాయి. ఈ మధ్యకాలంలో రిస్కీ స్టంట్‌లను డూప్స్‌కు బదులు హీరోలే చేస్తున్నారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి రిస్కీ స్టంట్ లు చేసే బదులు నిపుణులైన స్టంట్ మాస్టర్లను డూప్‌లుగా పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చి అని నిపుణులు చెప్పారు.