అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్యం మత్తులో నలుగురి ప్రాణాలు తీసాడు ఒక వ్యక్తి. పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని నియాకార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని కార్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురయిన కార్ బెంగళూరు వైపు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.


జాతీయ రహదారిపై ఉన్నా స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న వాహనం నెమ్మదించడంతో వెనకనుంచి వచ్చే కాదు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఢిల్లీ కి చెందిన ఒక యువతీ బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్ కార్డు, పంకార్డ్ ల ఆధారంగా రేఖ(21)నార్త్ దిల్లీ, ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం (31), బెంగళూరు, మనోజ్ మిట్టల్ (38) నార్త్ బెంగళూరు వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదానికి గురైన డ్రైవర్ చేతిలో బీర్ సీసాను పోలీసులు గుర్తించగా, మద్యం మత్తులోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనాస్థలంలో ప్రమాదానికి గురైన కార్ ను పక్కకు తీసి ట్రాఫిక్ పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుగొండ సిఐ తెలిపారు.