తన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని కిరాయి అడిగినందుకు ఆ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముచ్చర్లవారి వీధిలో వంగా ప్రసాద్ (50 ) ఇంట్లో ఏడాది కాలం నుండి చిన్నకొండయ్య కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు.సోమవారం రాత్రి రెండు నెలల నుండి అద్దె చెల్లించని కారణంగా ఇంటి యజమాని అద్దె చెల్లించమని అడగడంతో విచక్షణ మరచిన చిన కొండయ్య ప్రసాద్ తలపై రాయితో కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కొండయ్య పోలిసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.