సికింద్రాబాద్ నుండి దానాపూర్ బయలుదేరిన 2791 నెంబర్ గల దానాపూర్ ఎక్స్ప్రెస్ స్టేషన్ ఘనాపూర్ లోని రైల్వే గేటు దాటాక ఇంజన్, భోగిని కలిపి ఉన్న లింకు ఉడిపోవడంతో బోగీల నుండి ఇంజన్. విడిపోయింది. 250 మీటర్ల వరకు ఇంజిన్ ముందుకు వెళ్లిపోవడంతో రైల్వే స్టేషన్ సిబ్బంది ఇంజన్ బోగీలను తిరిగి లింక్ చేసి యథావిధిగా పంపించారు. ఈ సంఘటన కారణంగా స్టేషన్ ఘనాపూర్ లో 10:54 నుండి 11:22 సుమారు 28 నిమిషాల పాటు ట్రైన్ రైల్వే గంటలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.