తెలంగాణ విద్యుత్‌శాఖపై చైనా హ్యాకర్ల కన్ను పడి, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లు హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. అది గమనించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ తెలంగాణ విద్యుత్ శాఖకు హెచ్చరికలు జారీచేసి అప్రమత్తం చేసింది. సర్వర్లు, కంట్రోల్ ఫంక్షన్స్ గమనించాలని సీఈఆర్టీ సూచించి, విద్యుత్‌శాఖ వెబ్సైట్లో యూజర్ ఐటీ, పాస్‌వర్డ్‌లను మార్పించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హ్యాకర్ల విషయంలో వారు అప్రమత్తంగానే ఉన్నట్లు తెలిపారు.
చైనా హ్యాకర్లపై కేంద్రం అప్రమత్తం చేయడం వల్ల రాష్ట్ర సర్వర్లపై హ్యాకింగ్‌కు పాల్పడి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలియడం, కొన్ని సబ్స్టేషన్లలో థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్టు తెలియడం వల్ల చాల ప్రమాదం తప్పింది అన్నారు. కేంద్ర సమాచారంతో సాంకేతిక విభాగం అప్రమత్తమైందన్నారు. గ్రిడ్ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.