ఈ ఏడాది (2021) వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో పగటి పూట ఎండలు విపరీతంగా ఉంటాయని, దక్షిణ, మధ్య భారత్లో మాత్రం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు సముద్ర తీరాల దగ్గర కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర భారతంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్‌-జూన్‌కి సంబంధించిన వేసవి అంచనాలన్నీ ఏప్రిల్ లో విడుదల చేస్తారు. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయ్. ఎండ వేడికి జనాలు విలవిలలాడుతున్నారు.