నైజీరియాలో విద్యార్థినులు అపహరణకు గురైన విషయం మీకు తెలిసిందే! ఆ వార్త చదవడం కోసం ఈ యూ ఆర్ ఎల్ క్లిక్ చేయండి https://jrtvnews.com/26/02/2021/kidnapping-of-300-students/. నైజీరియాలో ఇటీవల అపహరణకు గురైన 279 మంది విద్యార్థినులు క్షేమంగా ఆ దుండగుల చెర నుంచి విడుదలయ్యారు. విద్యార్థినుల విడుదలకు ప్రభుత్వం దుండగులకు ఎలాంటి మూల్యం చెల్లించుకోలేదని గవర్నర్ బెల్లో మతవాలె ‌ వివరించారు. వారు ప్రస్తుతం అధికారుల వద్ద క్షేమంగా ఉన్నారని, వారిని విడుదల చేయించడానికి శాంతియుత మార్గంలో మేం చేసిన ప్రయత్నం ఫలించిందని, దుండగులకు ఎలాంటి మూల్యం చెల్లించలేదని, వారికి ఏమీ తిరిగి ఇవ్వకుండానే అపహరణకు గురైన వారిని వెనక్కి తీసుకురాగలిగాం అని వెల్లడించారు.


వైద్య పరీక్షల నిమిత్తం బాలికల్ని ఆరోగ్య కేంద్రానికి పంపించాం’ అని గవర్నర్‌ చెప్పారు.
నైజీరియాలోని జాంఫరా రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలపై కొందరు సాయుధులు దాడి చేసి 300 మంది విద్యార్థినులను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. డబ్బుకోసం, జైల్లో ఉన్న తమ వారి విడుదల కోసం ఉగ్రవాదులు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు, ఇది అక్కడ సహజమైన విషయం అయిపోతుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.