తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 40,181 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 163 పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. ఇవాళ్టితో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,99,086కి చేరింది. వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,635కి చేరింది. కరోనా నుంచి నిన్న 157 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,544కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,907 ఉండగా, వీరిలో 774 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య ఇప్పటికి 87,61,207కి చేరుకుంది.