ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే గతంలో బెదిరింపుల కారణంగా పలు చోట్ల అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.

కడప జిల్లా రాయచోటిలో 2 వార్డులు, ఎర్రగుంట్లలో 3 వార్డులు, చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆరు డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు ఇలా మొత్తం 14 చోట్ల రీ నామినేషన్లకు తిరిగి అవకాశం ఇచ్చారు.

కడప జిల్లాలో నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు. తిరుపతిలో ఆరు డివిజన్లకు మూడు రీ నామినేషన్లు దాఖలు చేశారు. పుంగనూరు మున్సిపాలిటీలో అభ్యర్థులు అసలు నామినేషన్ అనేదే వేయలేదు