జాతీయం (National) వార్తలు (News)

వరుస భూకంపాలు

భారత దేశం వరుస భూకంపాలతో అలజడికి లోనవుతుంది.ఇటీవలే ఎన్‌సీఆర్, బీహార్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పుడు అస్సాం, అండమాన్ నికోబార్ దీవుల్లోను భూప్రకంపనలు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. అదే విధంగా మంగళవారం తెల్లవారుజామున 1.32 గంటలకు మరల అస్సాంలోని మొరిగావ్‌లో భూమి కంపించింది.అందరు నిద్రిస్తున్న వేళ అకస్మాత్తుగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసి ఆరుబయటే చాలాసేపటి వరకు ఉండిపోయారు.
కాగా అండమాన్ నికోబర్ దీవులలో సంభవించిన భూకంపం అయితే రిక్టర్ స్కేల్‌లో 4.2 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. మరియు అస్సాంలోని మొరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 2.9 గా నమోదయింది.
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని సీస్మోలజీ అధికారులు వెల్లడించారు. స్వల్ప భూకంపాల వల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.