ఓ డిగ్రీ విద్యార్థినిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసిన సంఘటన విజయనగరంలో జరిగిన సంగతి తెలిసిందే! ఆ సంఘటన అనేక మలుపులు తిరుగుతుంది. తన బాబాయ్ ఇంటికి వెళ్ళడానికి బయల్దేరిన ఆమెను ఎవరు తీసుకువచ్చి అక్కడ పడేశారని విషయం ఇప్పటివరకు తేలలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు స్పృహ రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ విచారణలో ఆమె కొన్ని వివరాలను వెల్లడించింది. ఆమె మాటల్లోనే ఏమి జరిగిందో తెలుసుకుందాం…”నేను బాబాయ్ ఇంటికి వెళ్లకుండా తెర్లాంకు ఆటో ఎక్కాను.కానీ అప్పటికే దానిలో 3 అబ్బాయిలు ఉన్నారు. దానితో దిగిపోదామని ప్రయత్నించేసరికి వారు బలవంతంగా మరొక క్యాబ్ లో ఎక్కించారని రెండు రోజులు వారితో ఉంచుకుని సోమవారం ఉదయం గుర్ల దగ్గర తుప్పల్లో కాలు, చేతులు కట్టి పడేసి వెళ్లిపోయారు” అని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది.

సోమవారం ఉదయం పొదల్లోనుండి అరుపులు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందచేశారు.దాంతో ఎస్‌ఐ లీలావతి, సిబ్బంది అక్కడకు చేరుకొని చూడగా ఒక యువతీ పది ఉండడంతో ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి , ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం, పోలీసు జాగిలాలు పరిశీలించాయి. విచారణలో ఆమె విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న తెర్లాం మండలానికి చెందిన విద్యార్థినిగా గుర్తించి విలేకర్లకు వివరాలు అందించారు. ఆమె ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆరోగ్యంగానే ఉన్నా షొక్స్లో ఉందని అన్నారు. ఈవిషయమై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అయినా కేసును స్వీకరించి రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ‘శుక్రవారం తరగతి గదిలో ఆ విద్యార్థిని పడిపోయిందని విషజయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించాం. విజయనగరంలోనే ఉంటున్న తన బంధువుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి సోమవారం తిరిగి వస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఆదివారం ఆమె తన ఇంటికి కూడా చేరుకోలేదనే ఫోన్ వచ్చింది. దాంతో ఈ విషయం బయటకి వచ్చింది.