వందేళ్లుగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్న అణువుల అమరిక విషయంలో పురోగతి సాధించారు. ఘన పదార్థాల్లో అణువుల అమరిక తెలుసుకోవడం ఎంతో కీలకం. ఈ పదార్థాల్లో ఓ వర్గమైన అమార్ఫస్ ఘన పదార్థాల్లో అణువుల అమరిక గురించి మనకు తెలిసింది తక్కువే. అణువుల అమరిక గురించి యూసీఎల్ఏ శాస్త్రవేత్తలు త్రీడీ ఇమేజింగ్ ద్వారా అణువుల అమరికకు సంబంధించి అత్యంత స్పష్టమైన చిత్రాలు తీయగలగడంతో వీటి సాయం తీసుకుని అమార్ఫన్ ఘన పదార్థాలను మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చని, ఇది కొత్త పదార్థాలను డిజైన్ చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రిస్టలైన్ ఘన పదార్థాల గురించి శాస్త్రవేత్తలకు మంచి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆమార్ఫస్ సాలిడ్స్ మాత్రం శాస్త్రవేత్తలకు ఇప్పటివరకూ సవాలు విసురుతూనే వచ్చాయి. తాజాగా యూసీఎల్ఏ శాస్త్రవేత్తలు సమస్యను పరిష్కరించడం ఎంతో హర్షదాయకమైన విషయం.