వార్తలు (News)

రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం బలి

నల్గొండ జిల్లా నిడమనూరులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. లారీ బీభత్సంతో ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం అంతులేని విషాదాన్ని నింపింది. మిర్యాలగూడ నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ నిడమనూరు వద్ద ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి ఆ వాహనం పక్కకు ఒరిగి అదే సమయంలో వెనుకే వస్తున్న ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న తెప్పలమడుగు గ్రామ సర్పంచ్‌ తరి శ్రీనివాస్‌ (34), అతడి భార్య విజయ (30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారితోపాటే ఉన్న కుమార్తె శ్రీవిద్య (5), కుమారుడు కన్నయ్య (3)కు తీవ్ర గాయాలవ్వడంతో ఆ చిన్నారులను స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు. టాటా ఏస్‌ వాహనంలో ఉన్న వారిలో ముగ్గురు గాయపడగా వారికి మిర్యాలగూడలోనే చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు, హాలియా సీఐ వీరా రాఘవులు, స్థానిక ఎస్సై కొండల్‌ రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.