శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సమీపంలోని దుర్గా బార్‌ వద్ద నలుగురు బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు ఒకరినొకరు పీకలు కోసుకుని అరాచకం సృష్టించారు.
వీరిలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. వీరంతా విజయవాడ వాంబే కాలనీ వాసులుగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి స్థానికులను విచారిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.