తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఎనిమిది మంది రిమాండ్‌ ఖైదీలకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. గురువారం జైల్లో ఒకరు అస్వస్థతకు గురి కావడంతో అతనితో పాటు మరో ఇద్దరికి పరీక్షలు చేయించడంతో వారికీ కూడా కొవిడ్‌ నిర్దారణ అయింది. ఇవాళ మరో ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో మరొక ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. బాధిత ఖైదీలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్‌ కేంద్రంలో చికిత్స అందిస్తు్న్నట్లు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు.