అంబర్‌పేటలో మారుతీ నగర్‌లో జనావాసాల మధ్య అక్రమంగా యాసిడ్‌ తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం యాసిడ్‌ ట్యాంక్‌ పేలి ఇళ్లలోకి యాసిడ్‌ పడటంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. యాసిడ్‌ పరిశ్రమపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. పరిశ్రమకు ఎలాంటి అనుమతి లేదని, ఇటీవలే అక్కడ ఈతకొలను కూడా ఏర్పాటు చేశారని దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.