వార్తలు (News)

విమానాశ్రయానికి ఆర్టీసి బస్సులు ప్రారంభం

ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభమైన సంగతి పాఠకులకు తెలిసిందే! ఈ నేపథ్యంలో
ఈనెల 2వ తేదీ నుంచి 40 సీట్లు కలిగిన ఇంద్ర ఏసీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ కర్నూలు నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం వరకు ఒక్కొక్కరికి ఛార్జీ రూ.200, ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు బస్టాండు వరకు ఒక్కొక్కరికి ఛార్జీ రూ.50 వసూలు చేసేలా నిర్ణయించినట్లు ప్రాంతీయ అధికారి వెంకటరామం ఒక ప్రకటనలో తెలిపారు.

సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు బస్టాండు నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి విమానాశ్రయానికి 8.45 గంటలకు చేరుకుంటుందని, మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 13.30కు విమానాశ్రయానికి చేరుకుంటుందన్నారు. మంగళ, గురు, శనివారాల్లో మధ్యాహ్నం 14.00 గంటలకు కర్నూలు బస్టాండులో బయలుదేరి మధ్యాహ్నం 14.45కు విమానాశ్రయానికి చేరుకుంటుందన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరి 8.45కు, మధ్యాహ్నం 12.45 బయలుదేరి 13.30కు, మధ్యాహ్నం 14.00 గంటలకు బయలుదేరి 14.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటుందని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.