వార్తలు (News)

పోచంపాడు గోదావరిలో ఆరుగురి మృతి

నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు వీఐపీ పుష్కరఘాట్‌ వద్ద ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు అలాగే ఈరోజు ఉదయం ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, మాక్లుర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు చెందిన మూడు కుటుంబాలవారు గోదావరిలో స్నానానికి వెళ్లారు ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నదిలోకి జారిపోయారు.

వారిని కాపాడేందుకు మరో ఐదుగురు నదిలోకి దిగారు. ఇందులో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. స్థానికులు ఒక బాలుడిని సురక్షితంగా కాపాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆరు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్‌ (40), అతని కుమారులు శ్రీకర్‌(14), సిద్దార్థ్‌ (16), మక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్‌ మండలం డీకంపల్లికి చెందిన యోగేష్‌ (16), సురేశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.