కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్రకటించింది. అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ రూట్‌లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలును 2021 ఏప్రిల్ 2 నుంచి ఓ నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐఆర్‌సీటీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. మహారాష్ట్రలో 50 వేలకు పైగా యాక్టీవ్ కేసులున్నాయి. ఐఆర్‌సీటీసీ రద్దు చేసిన తేజస్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని ముంబై-గుజరాత్‌లోని అహ్మదాబాద్ రూట్‌లో ప్రయాణిస్తుంది. ఈ రైలు నడియాడ్, వడోదర, భరుచ్, సూరత్, వాపి, బోరివలి స్టేషన్లలో ఆగుతుందనే కారణం వల్లే ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ రైలును రద్దు చేస్తూ నెల రోజుల పాటు అహ్మదాబాద్-ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ రూట్‌లో తేజస్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉండదు.