తూర్పు తైవాన్‌లోని ఒక సోరంగంలో రైలు పట్టాలు తప్పడంతో 34 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పడంతో సహాయక బృందాలు లోపలికి చేరుకోవడం కష్టతరంగా మారడంతో మృతుల సంఖ్యా ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. సొరంగంలో దాదాపు 70 మంది చిక్కుపోయారని అధికారుల అంచనా. ఈ రైలులో 350 మంది ఉన్నట్టుగా 75 మంది గాయపడినట్లుగా అధికారులు చెప్తున్నారు.కాగా కశ్చితమైన సంఖ్య తెలుసుకోవడానికి ఇంకా వేచి చూడాలి!