కమ్మరి పనులు సాధారణంగా ఎప్పుడూ పురుషులే చేస్తుంటారు.కానీ గుజరాత్‌లోని భరూచ్‌, మఖ్తమ్‌పురాలో కమ్మరి పని చేసే మహిళలు చాల మంది ఉన్నారు. ఆ పనిని ఈ మహిళలు ఎన్నో ఏళ్ల నుంచీ కొనసాగిస్తున్నారు. వీరి కుటుంబాలు తరతరాల నుంచీ లోహపు పనిముట్లు చేస్తూ జీవిస్తున్నాయి. వారు మా తరతరాలుగా ఇదే పనిలో ఉండడం వల్ల మాకు వేరే పని ఏమి రాదని, వారు అందరి ఇళ్లలోనూ ఇదే పని చేస్తారని పురుషులకు పని ఎక్కువైనా ప్రతిసారీ ఇళ్లల్లో ఉండే స్త్రీలు కూడా ఇదే పని చేస్తారని అక్కడి స్థానికులు చెప్తున్నారు.

మారిన కాలంతో పాటు లోహపు పని ముట్లు చేయడానికి కూడా మెషిన్లు వచ్చిన కూడా అక్కడి వారు మాత్రం వీటిని సాంప్రదాయ పద్దతిలో చేతులతోనే చేస్తుంటారు. ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభుత్వ సహాయం అందితే వీరు తమ తరువాతి తరాలవారికి కూడా ఈ విద్యను అందించడానికి కావలసిన ఏర్పాట్లు చేయగలమని చెప్తున్నారు.