టెక్నాలజీ (Technology) వార్తలు (News)

తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాస్‌లు షురూ!!

తెలంగాణలో గురువారం (జూలై 1) నుంచి ప్రారంభమై ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే జరగనున్నాయి. విద్యాశాఖ ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. కరోనా ఉధృతి తగ్గేంత వరకు KG టు PG విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలోనే క్లాసులు నిర్వహిస్తారు. దీంతో వేసవి సెలవులు ముగిసిన తరువాత విద్యార్థులంతా మళ్ళీ ఆన్‌లైన్‌ క్లాసులకు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తూ దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది.

గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ తరగతులు ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సబ్జెక్టుకు 30 నిమిషాల చొప్పున క్లాసులు డీడీ యాదగిరి, టీశాట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న నేపథ్యంలో అవసరమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు మాట్లాడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

టీవీలు ఉండి ప్రసారాలు రానిచోట కలెక్టర్లు స్థానిక కేబుల్‌ ఆపరేటర్లను సంప్రదించి ప్రసారమయ్యేలా చూడాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు పైగా ఉండగా మరో పది లక్షల మంది ఇంటర్మీడియట్‌ చదువుతుండగా ఇప్పటికే టీ శాట్ యాప్‌ను 10లక్షలకు పైగా మంది విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి రోజూ విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయన్నారు ఇప్పటికే 50శాతం మంది ఉపాధ్యాయులు ప్రతిరోజు స్కూళ్లకు హాజరవుతున్నారు.. వీరంతా విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేసి క్లాసులు వింటున్నారా? లేదా? పర్యవేక్షించడమే గాకుండా వర్క్‌ షీట్స్‌ ఇచ్చి వారితో హోమ్‌ వర్క్‌ చేయించనున్నారని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.