క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

కశ్మీర్ యువతకు కేంద్రం వార్నింగ్ ??

జమ్ముకశ్మీర్ లో తీవ్ర వాద సమస్యను రూపుమాపాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 రద్దు చేసింది. కశ్మీర్ ను ముూడు ముక్కలు చేసి రెండేళ్లు పూర్తవుతున్నా అక్కడ తీవ్రవాదం తగ్గుతున్న ఆనవాళ్లు కనిపించకపోవడంతో అక్కడ యువతను కట్టడి చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

జమ్మూకశ్మీర్ లో అధికారులపై రాళ్లు రువ్వే వారిపై, జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకునే వారిపై ఇక మరింత కఠినంగా వ్యవహరించాలని, వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించబోమని, అలాగే పాస్ పోర్టు క్లియరెన్స్ కూడా ఇవ్వబోమని అధికారులు తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారి వివరాలు ఇప్పటికే తమ వద్ద ఉన్నాయని, పదే పదే సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •