జాతీయం (National) వార్తలు (News)

కమర్షియల్ సిలిండర్ ధరల పెరుగుదల!

ఆగస్ట్ 1న కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని కంపెనీలు సవరించి కమర్షియల్ సిలిండర్ ధర కొనేవారికి ధరను భారీగా పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.73.50 పెరిగింది. కమర్షియల్ సిలిండర్‌ను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తుంటారన్న విషయం తెలిసిందే! గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది. ఇప్పుడు రూ.73.50 పెరిగింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.157.50 పైనే పెరగడంతో వ్యాపారులపై భారీగా భారం పడనుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1803.

సబ్సిడీ సిలిండర్ ధరను పెంచలేదు. పాత ధరలే కొనసాగుతాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.887. గత నెలలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే! ఆయిల్ ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •