టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఫోన్‌పే, గూగుల్‌ పే లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ : కేంద్ర ప్రభుత్వం!!

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే అందుబాటులో ఉండడంతో ఆర్థిక లావాదేవీలు ఎక్కువమంది వీటి ద్వారానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి మరొక సర్వీసును తీసుకురానున్నారు. అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే చాలా ఈజీగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా ‘ఈ – రూపీ’ (E-Rupi)ని రూపొందించారు.

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆప్ ను రూపొందించింది. ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభించనున్న ‘ఈ రూపీ’ 2021, ఆగస్టు 02వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది.

లబ్దిదారుల ఉపయోగించే మొబైల్ ఫోన్ కు క్యూ ఆర్ కోడ్, SMS వౌచర్ రూపంలో నగదు చేరనుండగా ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్ (QR code) లేదా ఎస్ఎమ్మెస్ (SMS) వోచర్ ల ద్వారా లబ్దిదారుడి మొబైల్ ఫోన్ కి పంపిస్తారు. ఈ క్యూ ఆర్ కోడ్ ను లబ్దిదారుడు అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ – రూపీ యాప్ ను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •