అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

వీలయితే వచ్చే ఒలింపిక్స్ లో పాల్గొంటా : మేరీకోమ్‌!!

బాక్సింగ్‌ ఆడే ఓపిక తనలో ఇంకా ఉందని 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌ రింగ్‌ బరిలో కొనసాగుతానని మేరీకోమ్‌ తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీకోమ్‌ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలవగా ఓటమి అనంతరం స్వదేశానికి చేరుకున్న మేరీకోమ్‌కు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు.. ఇక బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురవడంతో ఆమె స్పందిస్తూ ‘టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాకపోవడం బాధను కలిగింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని అనుకున్నానా వరకు నేను మంచి ప్రదర్శననే చేశా. ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతలు తీరు సరిగా లేదు. తొలి రెండు రౌండ్లు గెలిచిన నేను ఎందుకు ఓడిపోతాను. బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి మీ సొంత జెర్సీని వాడకూడదు.. అని చెప్పారు. అయితే నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనూ అదే జెర్సీ వేసుకున్నా. అప్పుడు చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. కేవలం నా మానసిక ఆందోళన దెబ్బతీయడానికే జడ్జిలు అలా చేశారని, ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు” అంటూ ప్రశ్నించింది. ఇక రిటైర్మెంట్‌పై మేరీ కోమ్‌ మాట్లాడుతూ.. ”నా వయసు ఇంకా అయిపోలేదు.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా.. అవసరమైతే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తా” అంటూ చెప్పుకొచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    212
    Shares
  • 212
  •  
  •  
  •  
  •