ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

మద్యం దుకాణాలు పెంచడమే మద్యపాన నిషేదమా?: అచ్చెన్నాయుడు

సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలలో ప్రముఖంగా చెప్పుకోదగినది మద్యపాన నిషేధం. జగన్ ఎన్నికలలో విజేత కావడానికి ముఖ్య కారణాలలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఐతే తాజాగా ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్‌ చెప్పిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నించారు.

మద్యం దుకాణాలు పెంచడమే మద్యపాన నిషేదమా? అని, మద్యం మత్తులో మునిగి తేలుతున్న వైకాపా ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించడం ఖాయమని, రాష్ట్రంలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని ఆక్షేపించారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో 300 దుకాణాల ఏర్పాటుకు ప్రణాళికలు వేసి, అందులో 41 షాపులను అందుబాటులోకి తెచ్చారని, వాకిన్‌ స్టోర్‌ పేరుతో 90 మద్యం మాల్స్‌కు అనుమతులిచ్చి ఇప్పటికే 21 ప్రారంభించారని, రూ.25 వేల కోట్ల అప్పు కోసం భవిష్యత్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •