అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

లాడెన్‌లా చనిపోకూడదని మసూద్‌ అజార్‌ రక్షణ కల్పిస్తోన్న పాక్‌!!

ఒసామా బిన్‌ లాడెన్‌ సహా ఎంతో మంది ధీమాగా నివసించగలిగిన దేశం పాకిస్థాన్‌ అంటే అతిశయోక్తి కాదు. అలంటి పాకిస్తాన్ కి ఇప్పుడు జైషే మహమ్మద్‌ అధిపతి. 2001 భారత్‌ పార్లమెంట్‌పై దాడి సహా పలు ఉగ్రదాడుల్లో ప్రధాన కుట్రదారుడైన మసూద్‌ అజార్‌ను పాక్‌ ప్రభుత్వం తన అతిథిగా చూసుకుంటోంది.

మతం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అజార్‌ బహవల్‌పుర్‌లో రెండు విలాసవంతమైన భవంతుల్లో నివాసం కల్పించారు. అందులో ఒకటి ఒస్మాన్‌-ఒ-అలీ మసీదు పక్కన, ఇంకోటి అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో జామియా మసీదు సమీపంలో ఉంది. ఈ రెండింటికి పాక్‌ సైన్యం రక్షణ కల్పిస్తోంది.

అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో పెద్దగా జనసంచారం లేని ప్రాంతంలో తలదాచుకోవడంతో అమెరికాకు చెందిన సీల్స్‌ దళాలు చడీచప్పుడు లేకుండా దాడి చేసి హతమార్చాయి. అలాంటి ప్రమాదం తనకూ భారత ప్రభుత్వం నుంచి పొంచి ఉందన్న భయంతోనే బహవల్‌పుర్‌లో అజార్‌ తన మకాం పెట్టి నివాసానికి ఎంపిక చేసుకున్న రెండు భవంతులు రద్దీ ప్రాంతాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పైగా బహవల్‌పుర్ అజార్‌ పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చీమ చిటుక్కుమన్నా అతని అనుచరులకు తెలిసిపోతుంది. దీంతో తాను తప్పించుకునే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఉపాయం పన్నాడని నిపుణుల అభిప్రాయం!!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •