క్రైమ్ (Crime) వార్తలు (News)

రాజానగరం వద్ద లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు!!

ఆదివారం రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై తూర్పు గోనగూడెం వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగడంతో వెనుక రాజమహేంద్రవరం నుంచి తుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు దానిని ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో శంఖవరం మండలం కొత్తపేటకు చెందిన ఈగల శ్రీను, ఈగల సూర్యావతి, నక్కపల్లి మండలం సీతంపాలేనికి చెందిన గదుల నూకరత్నం, తునికి చెందిన బస్సుడ్రైవర్‌కు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •