జాతీయం (National) వార్తలు (News)

ఎట్టకేలకు కళకళలాడిన నేటి మార్కెట్లు !!

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ముగిసి ముదుపర్లలో ఆశలు రేకెత్తించాయి. ఉదయమే లాభాలతో మొదలైన మార్కెట్ సూచీలు రోజంతా అదే ఒరవడి కొనసాగించి చివరకు సెన్సెక్స్‌ 363 పాయింట్ల లాభంతో 52,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 15,885 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, టైటన్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌షార్మా, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలతో ముగిసాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •