క్రైమ్ (Crime) వార్తలు (News)

కొండాపూర్‌ మై హోం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి!!

ఆదివారం అర్థరాత్రి నగరంలోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా మృతి చెందిన వారిలో ఒకరిని కెనడాలో ఎంటెక్ చదువుతున్న ఆశ్రితగా గుర్తించారు. అర్థరాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో నలుగురు కారులో అతివేగంగా వస్తూన్నప్పుడు అదుపుతప్పి కొండాపూర్‌ మై హోం వద్ద ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •